స్వర్గం-నరకం

30, మార్చి 2010, మంగళవారం
"" నాన్నా.! నేను ఒక అబ్బాయిని ప్రేమించాను.. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను..""

""సరేలేమ్మా..! ఇంతకీ అబ్బాయి మంచివాడేనా..?""

""చాలా మంచివాడు నాన్నా.. జాబ్ కూడా ఉంది.., కానీ పరమ నాస్తికుడు నాన్నా.. దేవుడు-దెయ్యం., స్వర్గం-నరకం ఇవేవీ లేవంటాడు.."'

""పర్లేదు.. పెళ్ళికి ముందు చాలామంది అబ్బాయిలు అలాగే ఉంటారు.. పెళ్ళయ్యాక నెమ్మదిగా వాళ్ళే తెలుసుకుంటారు..""

ఇతనే..!

మంత్రిగారు పిచ్చాసుపత్రిలో కొత్త వార్డు ప్రారంభోత్సవానికి వెళ్ళారు...
ప్రారంభోత్సవం అయ్యాక డాక్టరు గారు అక్కడి రోగుల గురించి చెప్తున్నారు..

ఒక గదిలో పేషెంట్ ప్రశాంతంగా ఒక బొమ్మను పడుకోబెట్టుకుని దానికి సపర్యలు చెస్తున్నాడు..

డాక్టర్:: ""ఇతను ఒక అమ్మాయిని ప్రాణప్రదంగా ప్రేమించాడు.. కానీ ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది .. దానితో ఇతను ఇలా పిచ్చివాడు అయిపోయాడు.. ఆ బొమ్మని ఆ అమ్మాయి అనుకొని సేవలు చేస్తుంటాడు..""

వేరే గదిలో ఇంకో పిచ్చివాడు గట్టి గట్టిగా అరుస్తూ., చేతికి దొరికిందల్లా విసిరేస్తూ., చొక్కా చింపేసుకుని., జుట్టు పీకేసుకుంటూ చిందులు వేస్తున్నాడు..

డాక్టర్:: ""పాపం.! ఇందాక చెప్పిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంది ఇతనే..!""

ఏక్ నిరంజన్

21, ఫిబ్రవరి 2010, ఆదివారం
తెలంగాణా విద్యార్ధుల కోసం ఏక్ నిరంజన్ టైటిల్ సాంగ్...

పెన్నూ లేదు, పేపర్ లేదు..,
పేపర్ మీద పెన్ను పెట్టే పనీ లేదు..,
జై కే.సి.ఆర్.
ఎక్జాం లేదు., కాలేజ్ లేదు.,
కాలేజ్ వెళ్ళి ఎక్జాం రాసే పనీ లేదు..,
జై కే.సి.ఆర్....

నిజమైన భర్త

14, ఫిబ్రవరి 2010, ఆదివారం
రాజు గారి దగ్గరకు ఇద్దరు వ్యక్తులు ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి., ఈమె నా భార్య అంటె నా భార్య అని
వాదించసాగారు..

రాజుగారికి వారిరువురిలో ఒకడు భర్త, మరొకడు ప్రియుడు అని అర్ధమైంది.. కాని వారిద్దరిలో ఎవరు భర్త అనేది తేలడం లేదు..

రాజుగారికి ఒక బిడ్డ, ఇద్దరు తల్లుల విషయంలో వారి తాత గారి తీర్పు గుర్తుకు వచ్చింది.. వెంటనే కత్తితో ఆమెని రెండు సగ భాగాలుగా నరికి చెరి ఒక భాగం పంచమని తీర్పు చెప్పారు.

మొదటివ్యక్తి:: నాకు అభ్యంతరం లేదు.. అలాగే చేయండి..

రెండవవ్యక్తి:: వద్దు వద్దు., ఆమెను ఏమీ చేయకండి., అతనికే ఇచ్చేయండి..

రాజుగారు (మీసం మెలేస్తూ) :: మొదటివ్యక్తే ఆమె నిజమైన భర్త.. ఆమెను అతనికే ఇచ్చి పంపండి.. అమ్మాయికి ఏదైనా జరిగితే తట్టుకోలేని వాడు ప్రియుడు కాగలడు కాని భర్త కాజాలడు..

ఈ కుక్కే

3, ఫిబ్రవరి 2010, బుధవారం
సుబ్బారావు ఆఫీసుకి ఒక రోజు అనుకోకుండా సెలవు వచ్చేసరికి కారులో షికారుకి బయలుదేరాడు..
దారిలో ఒక శ్మశానం దగ్గర చాలా పెద్ద క్యూ ఉండేసరికి ఆసక్తిగా లోపలికి వెళ్ళాడు..
అక్కడ రెండు సమాధులు కడుతున్నారు.. ఒకాయన తాపీగా సిగరెట్టు కాల్చుకుంటు తన కుక్కను ప్రేమగా నిమురుతున్నాడు..

సుబ్బారావు (ఆసక్తిగా) :: "ఈ సమాధి ఎవరిదండి.?"

అతడు:: "నా భార్యది..నా మీద అరిచిందని నా ఈ పెంపుడు కుక్క ఆవిడని కొరికి చంపేసింది.."

సుబ్బారావు:: "మరి ఈ రెండో సమాధి ఎవరిదండి.?"

అతడు:: "ఓ అదా..! మా అత్తగారిది.! ఆవిడని కూడా ఈ కుక్కే కొరికి చంపేసింది.."

సుబ్బారావుకి ఆ కుక్క మీద ఎక్కడాలేని ప్రేమ పుట్టుకొచ్చేసింది..

"సార్ సార్..! ఈ కుక్కని నాతో ఒక్క వారం రోజులు పంపగలరా..?" చాలా ఆశగా అడిగాడు సుబ్బారావు..

అతడు:: "సరే సరే.. మీ నెంబర్ 177.. వెళ్ళి ఆ లైన్లో చివరన నుంచోండి.. మీ పేరు, అడ్రెస్ చెబుదురు గాని.."


..................

తెలిసొచ్చింది..

24, జనవరి 2010, ఆదివారం
రమేష్., సురేష్ ఇద్దరు బార్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు..

రమేష్:: నామొదటి భార్య చాలా ఉత్తమురాలు., నెమ్మదస్తురాలు.. ఈ ప్రపంచం లోనే అత్యంత శాంతస్వభావురాలు..

సురేష్:: అదేంటి మరి., తను పరమ గయ్యాళి అనే కదా విడాకులు ఇచ్చేసి రెండో పెళ్ళి చేసుకున్నావు.?

రమేష్:: ప్చ్.. ఆ విషయం రెండో పెళ్ళి చేసుకున్నాకే తెలిసొచ్చింది..

...

నాయకుడు

17, జనవరి 2010, ఆదివారం
ఒక ప్రముఖ రాజకీయ నాయకుని భార్య చనిపోయి నరకానికి వెళ్ళింది... అక్కడ ఎటువైపు చూసినా కొన్ని వేల గడియారాలు వేళ్ళాడదీయబడి ఉన్నాయి.. ఆమె నేరుగ యమధర్మరాజునే కలిసి అడిగింది..

రాజకీయనాయకుని భార్య:: "స్వామీ..! ఇన్ని గడియారాలు ఎందుకు..? సమయం చూడడానికి ఒకటి సరిపోతుంది కదా.."

యముడు ఆమెకు సందేహ నివృత్తి చెయాలని., "అమ్మా..! అవి గడియారాలు కావు.. అవి భూమిపైన మానవుడు చెప్పే ప్రతీ అసత్యానికి ఒక అంకె చొప్పున తిరుగుతూ ఉంటాయి.."

రాజకీయనాయకుని భార్య:: "మరైతే ఇక్కడ ఒక గడియారం ఒక అంకె తిరిగి ఆగిపొయింది., మరొకటి అసలు తిరగటం లేదు.. "

యముడు:: "చూడమ్మా.. మొదటిది ఒక సంఘసంస్కర్తది. అతను ఒకేఒక సారి అసత్యం పలికాడు. అందువల్ల అతని గడియారం ఒక అంకె తిరిగి ఆగిపోయింది.. రెండవది ఒక సన్యాసిది. అతను అసత్యమే పలుకడు కాబట్టి అది అలా తిరగడం లేదు.. "

రాజకీయనాయకుని భార్య:: "మరైతే నా భర్త గడియారం ఎక్కడ ఉన్నది స్వామీ.?

యముడు:: "అది నా బెడ్ రూం లో ఉన్నది.. ప్రస్తుతం నేను దానిని సీలింగ్ ఫ్యాన్ గా వాడుకుంటున్నాను.."

...