తెలిసొచ్చింది..

24, జనవరి 2010, ఆదివారం
రమేష్., సురేష్ ఇద్దరు బార్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు..

రమేష్:: నామొదటి భార్య చాలా ఉత్తమురాలు., నెమ్మదస్తురాలు.. ఈ ప్రపంచం లోనే అత్యంత శాంతస్వభావురాలు..

సురేష్:: అదేంటి మరి., తను పరమ గయ్యాళి అనే కదా విడాకులు ఇచ్చేసి రెండో పెళ్ళి చేసుకున్నావు.?

రమేష్:: ప్చ్.. ఆ విషయం రెండో పెళ్ళి చేసుకున్నాకే తెలిసొచ్చింది..

...

నాయకుడు

17, జనవరి 2010, ఆదివారం
ఒక ప్రముఖ రాజకీయ నాయకుని భార్య చనిపోయి నరకానికి వెళ్ళింది... అక్కడ ఎటువైపు చూసినా కొన్ని వేల గడియారాలు వేళ్ళాడదీయబడి ఉన్నాయి.. ఆమె నేరుగ యమధర్మరాజునే కలిసి అడిగింది..

రాజకీయనాయకుని భార్య:: "స్వామీ..! ఇన్ని గడియారాలు ఎందుకు..? సమయం చూడడానికి ఒకటి సరిపోతుంది కదా.."

యముడు ఆమెకు సందేహ నివృత్తి చెయాలని., "అమ్మా..! అవి గడియారాలు కావు.. అవి భూమిపైన మానవుడు చెప్పే ప్రతీ అసత్యానికి ఒక అంకె చొప్పున తిరుగుతూ ఉంటాయి.."

రాజకీయనాయకుని భార్య:: "మరైతే ఇక్కడ ఒక గడియారం ఒక అంకె తిరిగి ఆగిపొయింది., మరొకటి అసలు తిరగటం లేదు.. "

యముడు:: "చూడమ్మా.. మొదటిది ఒక సంఘసంస్కర్తది. అతను ఒకేఒక సారి అసత్యం పలికాడు. అందువల్ల అతని గడియారం ఒక అంకె తిరిగి ఆగిపోయింది.. రెండవది ఒక సన్యాసిది. అతను అసత్యమే పలుకడు కాబట్టి అది అలా తిరగడం లేదు.. "

రాజకీయనాయకుని భార్య:: "మరైతే నా భర్త గడియారం ఎక్కడ ఉన్నది స్వామీ.?

యముడు:: "అది నా బెడ్ రూం లో ఉన్నది.. ప్రస్తుతం నేను దానిని సీలింగ్ ఫ్యాన్ గా వాడుకుంటున్నాను.."

...

అసలు రహస్యం

70 సంవత్సరాల వయసున్న ఒక పారిశ్రామికవేత్తను ఇంటర్వ్యూ చేస్తూ ఓ విలేఖరి..

విలేఖరి:: "మీరు ఈ వయసులో కూడా ఇంత ఉల్లాసంగా., ఉత్సాహంగా., హుషారుగా ఉండడానికి కారణం ఏమిటో చెపుతారా..?"

పారిశ్రామికవేత్త:: "నా భార్య..!"

విలేఖరి (ఆశ్చర్యంగా) :: "కానీ ఆవిడ చాలాకాలం క్రితమే చనిపోయిందని విన్నానే..!"

పారిశ్రామికవేత్త:: "అవును.. అదే అసలు కారణం.."

...

అదే కదా బాధ..!

15, జనవరి 2010, శుక్రవారం
డాక్టర్:: మీకు నిద్ర బాగా పట్టాలంటే మీ భయాలు, ఆందోళనలు, చిరాకులు, కోపాలు అన్నీ మీ పడగ్గది బయటే వదిలేయండి.. ఈ మాత్రం దానికి మందులు ఏమీ అవసరం లేదు..

అప్పారావు:: సారీ డాక్టర్ గారు.. మా ఆవిడ తను బయట పడుకునేందుకు ఒప్పుకోదు ...




..

లక్షాధికారి..

9, జనవరి 2010, శనివారం
రాణి, గీత వుమన్స్ హాస్టల్ నుండి ఆఫీసుకు బయలుదేరారు..
దారిలో ఒక బిక్షగాడు ఎదురై పరమ దీనంగా అడుక్కోవడం మొదలుపెట్టాడు..
బిక్షగాడు ( దీనంగా ):: అమ్మా.. తల్లీ.. భోజనం చేసి నాలుగు రోజులు అయ్యింది.. ఒక్క రూపాయి ధర్మం చేయండి.. పుణ్యం ఉంటుంది...

వెంటనే గీత పర్స్ లో నుండి ఒక వంద రూపాయల నోటు తీసి అతడికి ఇచ్చింది..

( అతను వెళ్ళిపోయాక... )

రాణి:: నువ్వు ఎంత గొప్పదానివి గీతా.. అడుక్కునే వాడికి వంద రూపాయలు దానం చేసావు అంటే నువ్వు చాలా గొప్ప దాతవి..

గీత:: నువ్వు మరీ అంతగా పొగడకు.. అతను నా పాత బాయ్ ఫ్రెండే.. అంతకు ముందు అతను లక్షాధికారి.. నాకోసం చాలా చాలా ఖర్చు పెట్టేవాడు తెలుసా.... ఆఖరికి ఇలా అయిపోయాడు..




...

చక్కని పాట

8, జనవరి 2010, శుక్రవారం
సుబ్బారావు కొత్తగా విడుదల అయిన తన అభిమాన నటుడి సినిమాకు వెళ్ళాడు..
అతి కష్టం మీద చొక్కా నలిగినా, జుట్టు చెదిరినా టిక్కెట్ మాత్రం సంపాదించాడు..
తీరా హాల్లో కూర్చోగానే కడుపులో ఒకటే గుడ గుడ.. బరువు దించుకుని ప్రశాంతంగా సినిమా చూడాలని ఆ హల్లో ఉన్న ఏకైక బాత్రూంకి వెళ్ళాడు.. కాని అప్పటికే లోపల ఎవరో ఉండేసరికి సినిమా ఎలాగైనా మొదటినుండి చూడాలని ఒక ప్రక్క కంగారు., మరో ప్రక్క కడుపులో గుడ గుడతో లోపల ఉన్న వాడిని త్వరగా బయటకు రమ్మని ఒక చక్కని సినిమా పాట అందుకున్నాడు..
సుబ్బారావు:: రావోయి చందమామా..! మా వింత గాధ వినుమా.. రావోయి చందమామా..! రావోయి చందమామా..!

(లోపల ఉన్న వాడికి విషయం అర్ధం అయ్యింది.. తనూ ఒక పాట అందుకున్నాడు.. )

లోపలి వ్యక్తి:: స్... ఆగవోయి భారతీయుడా..! ఆగి పాడవోయి విజయ గీతికా...! ఆగవోయి భారతీయుడా..!

సుబ్బారావు (కోపంగా):: ఆగదూ.. ఆగదూ..! ఆగదు ఏ నిముషము నీ కోసమూ.. ఆగితే సాగదు ఈ లోకమూ.. ముందుకు సాగదు ఈ లోకమూ..!

లోపలి వ్యక్తి (శాంతంగా):: కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు..! మహా పురుషులవుతారు.. తరతరాలకు చెరగని గురుతు అవుతారు... ఇలవేలుపులు అవుతారు...

సుబ్బారావు:: ???

అసలు విషయం

7, జనవరి 2010, గురువారం
కిషోర్ ఆత్మహత్య చేసుకోవడానికి కొండ అంచుకు చేరుకున్నాడు.....
ఇది చూసిన దేవుడు తన భక్తుడిని కాపాడుకోవాలని ఒక్కసారిగా ప్రత్యక్షం అయ్యాడు...
దేవుడు:: ఆగు నాయనా..! ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావు..?
కిషోర్:: స్వామీ..! నేను ఎన్నో తప్పులు, మరెన్నో పాపాలు, ఇంకెన్నో నేరాలు చేసాను.. ఆ పశ్చాతాపం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను..
దేవుడు:: ఆవేశపడకు నాయనా.. దీనికి ఏదో ఒక పరిష్కారం చూద్దాం..
కిషోర్:: దీనికి ఒక్కటే పరిష్కారం స్వామీ..! నాకు ప్రాయశ్చిత్తం కావాలి.. అందుకు నాకు కష్టాలు కావాలి., కన్నీళ్ళు రావాలి.. బాధలతో నా జీవితంపై నాకే అసహ్యం వేయాలి.. నా జీవితం సర్వనాశనం అయ్యిందని నాలో నేనే కుళ్ళి కుళ్ళి ఏడవాలి.......
దేవుడు (చిరాగ్గా) :: ఏం నాయనా..! నీకు పెళ్ళి కావాలని ఒక్క ముక్కలో ఏడవ్వచ్చు కదా...!!!

సాయి బాబా