చక్కని పాట

8, జనవరి 2010, శుక్రవారం
సుబ్బారావు కొత్తగా విడుదల అయిన తన అభిమాన నటుడి సినిమాకు వెళ్ళాడు..
అతి కష్టం మీద చొక్కా నలిగినా, జుట్టు చెదిరినా టిక్కెట్ మాత్రం సంపాదించాడు..
తీరా హాల్లో కూర్చోగానే కడుపులో ఒకటే గుడ గుడ.. బరువు దించుకుని ప్రశాంతంగా సినిమా చూడాలని ఆ హల్లో ఉన్న ఏకైక బాత్రూంకి వెళ్ళాడు.. కాని అప్పటికే లోపల ఎవరో ఉండేసరికి సినిమా ఎలాగైనా మొదటినుండి చూడాలని ఒక ప్రక్క కంగారు., మరో ప్రక్క కడుపులో గుడ గుడతో లోపల ఉన్న వాడిని త్వరగా బయటకు రమ్మని ఒక చక్కని సినిమా పాట అందుకున్నాడు..
సుబ్బారావు:: రావోయి చందమామా..! మా వింత గాధ వినుమా.. రావోయి చందమామా..! రావోయి చందమామా..!

(లోపల ఉన్న వాడికి విషయం అర్ధం అయ్యింది.. తనూ ఒక పాట అందుకున్నాడు.. )

లోపలి వ్యక్తి:: స్... ఆగవోయి భారతీయుడా..! ఆగి పాడవోయి విజయ గీతికా...! ఆగవోయి భారతీయుడా..!

సుబ్బారావు (కోపంగా):: ఆగదూ.. ఆగదూ..! ఆగదు ఏ నిముషము నీ కోసమూ.. ఆగితే సాగదు ఈ లోకమూ.. ముందుకు సాగదు ఈ లోకమూ..!

లోపలి వ్యక్తి (శాంతంగా):: కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు..! మహా పురుషులవుతారు.. తరతరాలకు చెరగని గురుతు అవుతారు... ఇలవేలుపులు అవుతారు...

సుబ్బారావు:: ???

కామెంట్‌లు లేవు: